Telugu Lyrics
శరణాగత త్రాణం గరుడ వాహనం
పాహిమాం శ్రీ వేంకటేశం
పాలసంద్రంబులోన పరమ పతికి
దివ్య కాంతలు సేవించు చుండగా
అంతరంగంబులోన అనురాగంబుతో
అమ్మ లక్ష్మి పతిని అర్చించు చుండగా
అన్నమయ్య కీర్తనల అద్భుత రాగం
అన్న మయని దయతో అమ్మ వరాలిచ్చి
అన్న వస్త్రాలుగా వరమిచ్చెనని
అన్నమయ్య కీర్తనలు ఆలకించి
వేణు వేంకటేశం భానుకోటి ప్రకాశం
శరణాగత త్రాణం గరుడ వాహనం
పాహిమాం శ్రీ వేంకటేశం
భక్తితోడ నీకు భజనలు చేసి
మోక్ష సాధనము గాంచుచుంటిమి
ముక్తి మార్గమునకు ముప్పు తొలగించు
ముకుంద నామమున ముక్తిని పొందితిమి
కరుణామయ శ్రీ వేంకటరమణ
కాలాతీత శ్రీ వేంకటరమణ
మా వ్రాత నొకసారి మార్చుమా
మరల మరల నీ వ్రాత నొకసారి మార్చుమా
English Lyrics / Transliteration
Sharanagatha Traanam Garuda Vahanam
Paahimam Sri Venkatesham
Pala sandrambulona parama pathiki
Divya kanthalu sevinchu chundaga
Antharangambulona anuragambuthō
Amma Lakshmi pathini archinchu chundaga
Annamayya keerthanalu adbhutha ragam
Anna mayani dayatho amma varalichhi
Anna vastraluga varamichchenani
Annamayya keerthanalu aalakinchii
Venu Venkatesham Bhanukoti Prakasham
Sharanagatha Traanam Garuda Vahanam
Paahimam Sri Venkatesham
Bhaktithoda neeku bhajanalu chesi
Moksha sadhanam ganchuchuntimi
Mukthi margamunaku muppu tholaginchu
Mukunda namamuna mukthini pondithimi
Karunamaya Sri Venkataramana
Kalaatheetha Sri Venkataramana
Maa vratha nokasari maarchuma
Marala marala nee vratha nokasari maarchuma