Telugu Lyrics
అఖిలమును సృష్టించి యెంతయు
నిరంతరము పోషించి క్షయము
నొందించు ఆ పరబ్రహ్మమున
పరంధాముని పరంజ్యోతిని
భజియింతు నానాటికి
శ్రుతులన్నియు చాటెడు సారం
భువనములకు మూలం
శివమయంబై యొప్పు సర్వజ్ఞుని
అన్నిటికిని అధీనుడు
అనంతరూపుడై వెలుగొందు
అమర దేవుని భజియింతు నానాటికి
అంతరహితుడై సర్వాంతర్యామి
అఖిలమును పరిపాలించు
అపారకరుణామయుడు
అచ్యుతుడు ఆ దేవదేవుని
అర్చన సేతు నానాటికి
English Lyrics / Transliteration
Akhilamunu srushtinchi yentayu
Nirantaramu poshinchi kshayamu
Nondinchu aa parabrahnamuna
Paramdhamuni paramjyotini
Bhajiyintu naanatikii
Shrutulanniyu chaatedu saaram
Bhuvanamulaku moolam
Shivamayambai yoppu sarvagnyunidi
Annitikini adheenudu
Anantarupudai velugondu
Amara devunidi bhajiyintu naanatikii
Antarahitudai sarvaantaryaami
Akhilamunu paripaalinchi
Apaarakarunaamayudu
Achyutudu aa devadevunidi
Archana sethu naanatikii