Telugu Lyrics
పాపములెల్లా తొలగి పోవును పరలోక సుఖము కలుగును
కలియుగ కల్పతరువగు సాయినాథుని
భక్తితో గొల్చిన వారికి
కష్టములు తొలగి సుఖము కలుగును
కరుణామయుడగు సాయినాథుని
గురువాయుపురి వాసి శ్రీ సాయినాథుని
పూజించిన వారికి
పుణ్యములు దక్కును కోరిన వరములు
యిచ్చును సద్గురు సాయినాథుని
భక్తి భావముతో సాయి నామము
స్మరించిన యెడల
ముక్తి మార్గము సులువుగ దొరకును
మురళీధర సాయినాథుని
మాయా ప్రపంచమున మనసులు బంధించి
తిరిగే మానవులకు
తత్వ జ్ఞానమును సాయినాథుడే
తెలియచేయును సాయి నాథుడే
శంకర సాయినాథుని శరణుజొచ్చిన
భక్తుల కష్టములను
తొలగించును చింతలనెల్లా తీర్చును
తల్లిదండ్రి సాయి నాథుడే
అభయము నిచ్చి ఆర్తిని దీర్చును
అందరి కష్టములను
జోల పాట పాడి జోకొట్టును
అన్నదాత సాయినాథుడే
భక్తుల కోరికలన్నియు దీర్చును
భవబంధముల నుండి
విముక్తి కలిగించు వెలుగును చూపును
విశ్వనాథ సాయినాథుడే
శ్రీ సాయినాథుని సత్య స్వరూపుని
నిత్యము గొల్చిన వారికి
శ్రీకర శుభములన్నియు చేకూరును
శ్రీనివాస సాయినాథుడే
English Lyrics / Transliteration
Papamul ella tolaga povunu paraloka sukhamu kalugunu
Kaliyuga kalpataruvagu Sai Nathuni
Bhaktitho golchinavariki
Kashtamulu tolaga sukhamu kalugunu
Karunamayudagu Sai Nathuni
Guruvayupuri vasi Sri Sai Nathuni
Poojinchanavariki
Punyamulu dakkunu korina varamulu
Ichunu sadguru Sai Nathuni
Bhakti bhavamutho Sai Namamu
Smarinchina yedala
Mukti margamu suluvuga dorakunu
Muralidhara Sai Nathuni
Maya prapanchamuna manasulu bandhinchi
Thirige manavulaku
Tattva jnanamunu Sai Nathude
Teliyacheyunu Sai Nathude
Shankara Sai Nathuni sharanuchochina
Bhaktula kashtamulanu
Tolaginchunu chinthalanella theerchunu
Thallidandri Sai Nathude
Abhayamu ichi arthini theerchunu
Andari kashtamulanu
Jola paata paadi jokottunu
Annadaatha Sai Nathude
Bhaktula korikalanni theerchunu
Bhavabandhamula nundi
Vimukti kaliginchu velugunu chupunu
Vishwanath Sai Nathude
Sri Sai Nathuni satya swarupuni
Nityamu golchinavariki
Shrikara shubhamulanni chekurunu
Srinivasa Sai Nathude