Telugu Lyrics
నీ మధురమైన స్వరముతో
నే నిదురపోదును జాము నాటి
నీదు కౌగిలిలోన, నా ప్రియతమా
నీ సిగ్గుల నవ్వుల మెరుగులలో
నీ కనుల కాంతుల వెలుగులలో
నా మనసు చెంత చేరి మరులు
నీ వయ్యారముల తీరులలో
పలికే నీ పలుకుల సవ్వడులు
పారే నీ నడకల హొయలు
చిలికే నీ చేతల మహిమలు
మురిసిపోవగ చేయు మధుర భావాలు
నీ రూప లావణ్య సీమలందు
నే నిలచి పొందు ప్రేమ నందు
నీవు నేనని మరచి ఏకమౌదు
ఈ జన్మమున, నా ప్రియతమా
English Lyrics / Transliteration
Nī madhuramaina svaramutō
Nē nidurapōdunu jāmu nāṭi
Nīdu kaugiḷilōna, nā priyatamā
Nī siggula navvula merugulalō
Nī kanula kāntula velugulalō
Nā manasu centa cēri marulu
Nī vyyāramula tīrulalō
Palikē nī palukula savvaḍulu
Pāre nī naḍakala hoyalu
Cilikē nī cētala mahimalu
Murasipōvaga cēyu madhura bhāvālu
Nī rūpa lāvaṇya sīmalandu
Nē nilaci pondu prēma nandu
Nīvu nēṇani maraci ēkamoudhu
Ī janmamuna, nā priyatamā