Telugu Lyrics
దేవా నీగుణ గానము నేనెపుడు పాడెదను
నేగుణ గానము నేనెపుడు పాడెదను
దేవా నీగుణ గానము నేనెపుడు పాడెదను
శ్రీకర సుగుణ సాగర శ్రీకృష్ణ
నా సుఖము నాదు శ్రేయస్సు నీ చరణారవిందములందు
అర్పించెదను నేనెపుడు
నీగుణ గానము నేనెపుడు పాడెదను
దేవా నీగుణ గానము నేనెపుడు పాడెదను
పన్నగ తల్పశయనా
శంఖ చక్ర గదాధర
పంకజ లోచన
ప్రణవ స్వరూప
మోహన రూప
బలరామ అనుజ
పారవశ్యమున గంతులిడుచు
గాన మొనర్చెదను
నీ నామ స్మరణమున
నే గంధర్వుడనయ్యెదను
అంతరంగమున నిండిన
అనంత ప్రేమతో
నీ స్తుతి చేయుచు
నిత్యము సంతోషించెదను
శ్రీకర సుగుణ సాగర శ్రీకృష్ణ
నా సుఖము నాదు శ్రేయస్సు నీ చరణారవిందములందు
అర్పించెదను నేనెపుడు
నీగుణ గానము నేనెపుడు పాడెదను
దేవా నీగుణ గానము నేనెపుడు పాడెదను
మధుర మధురముగ నీ
నామ మధువును గ్రోలి
మత్తె కెదను
మరతును లోకమును
అభయ మొసగు సత్య సంకల్ప
అందరి దేవా
నా యందు నీవు
నీ యందు నే నుండునట్లు
కరుణించెదవు
శ్రీకర సుగుణ సాగర శ్రీకృష్ణ
నా సుఖము నాదు శ్రేయస్సు నీ చరణారవిందములందు
అర్పించెదను నేనెపుడు
నీగుణ గానము నేనెపుడు పాడెదను
దేవా నీగుణ గానము నేనెపుడు పాడెదను
English Lyrics / Transliteration
Deva neeguna gaanamu nenepudu paadedanu
Neeguna gaanamu nenepudu paadedanu
Deva neeguna gaanamu nenepudu paadedanu
Sreekara suguna saagara Sreekrishna
Naa sukhamu naadu sreyassu nee charanaaravindamulandu
Arpinchedanu nenepudu
Neeguna gaanamu nenepudu paadedanu
Deva neeguna gaanamu nenepudu paadedanu
Pannaga thalpasayana
Sankha chakra gadadhara
Pankaja lochana
Pranava svaroopa
Mohana roopa
Balarama anuja
Paaravashyamuna ganthuliduchu
Gaana monarchedanu
Nee naama smaranamuna
Ne gandharvudanayyedanu
Antharangamuna nindina
Anantha prematho
Nee stuthi cheyuchu
Nityamu santhoshinchedanu
Sreekara suguna saagara Sreekrishna
Naa sukhamu naadu sreyassu nee charanaaravindamulandu
Arpinchedanu nenepudu
Neeguna gaanamu nenepudu paadedanu
Deva neeguna gaanamu nenepudu paadedanu
Madhura madhuramuga nee
Naama madhuvunu groli
Matthe kedanu
Marathunu lokamunu
Abhaya mosagu Satya Sankalpa
Andari deva
Naa yandu neevu
Nee yandu ne nundunatlu
Karunichedavu
Sreekara suguna saagara Sreekrishna
Naa sukhamu naadu sreyassu nee charanaaravindamulandu
Arpinchedanu nenepudu
Neeguna gaanamu nenepudu paadedanu
Deva neeguna gaanamu nenepudu paadedanu