Telugu Lyrics
మధురం మధురం సదా స్మరింపగా
కరుణాసాగర కరుణామయ
నరహరి నీవే శరణ్యమా
లలితములైన నీ లీలా విభవము
అలరారుచుండెను శ్రీవేదికన్
అదితినందన అఖిలజనన
పరమపురుష నీవే దైవమా
అజునారాధ్యుడు ఆదిదేవుడు
అంతర్యామి నీవని తెలియగ
అంధకారము తొలగిపోగా
అనుగ్రహింపవా నరసింహమా
భువనైకవీర భుజవిక్రమ
భవ్యనామము నీదని తెలియగ
భువిలో సుఖములు పొందువారము
భువనభర్తవు నీవేగ దైవమా
English Lyrics / Transliteration
Madhuram madhuram sadaa smarimpagaa
Karunasaagara karunamaya
Narari neeve sharanayamaa
Lalithamulaina nee leela vibhavamu
Alaraaruchundenu Sree Vedikan
Aditinandana akhilajanana
Paramapurusha neeve daivamaa
Ajunaaraadhyudu aadidevudu
Antaryaami neevani teliyagaa
Andhakaaramu tolagipogaa
Anugrahimpavaa Narasimhamaa
Bhuvanavira bhuja vikrama
Bhavyanaamamu neevani teliyagaa
Bhuvi lo sukhamulu pondhuvaramu
Bhuvana bhartavu neeve ga daivamaa