Telugu Lyrics
కనులకు పండుగ సేయరండి
పసుపు కుంకుమ అక్షింతలు
చల్లెదము రారండి
పల్లె పల్లె పల్లె పల్లె
కళ్యాణ మండపం
శ్రీరామచంద్రుని శుభలగ్నాన
సీతాదేవికి తాళిగట్టగా
అందరము కలిసి చప్పట్లు కొట్టగా
అపురూప దృశ్యం
భద్రాచల క్షేత్రాన
భక్తకోటి వెల్లువ
శ్రీరామనామ స్మరణతో
పరవశించిపోవగా
తల్లిదండ్రులు సీతారాములు
దీవింతురు మనలను
అంతులేని ఆనందము
అందరికి పంచగా
శ్రీరామనామం నిత్యం స్మరియింపుడు
సంసార సాగరాన్ని దాటి పోయి
మోక్ష మార్గం కనుగొనుడు
భక్తితో పూజింపుడు
English Lyrics / Transliteration
Kanulaku panduga cheyarandi
Pasupu kumkuma akshinthalu
Challedamu rarandi
Palle palle palle palle
Kalyana mandapam
Sri Ramachandruni subha lagnana
Sithadevi ki thali kattaga
Andaram kalisi chappatlu kottaga
Apurupa drushyam
Bhadhrahala kshetrana
Bhakta koti velluva
Sri rama nama smaranatho
Paravashinchipovaga
Thalli dhandrulu Sita Ramulu
Divinthuru manalanu
Anthuleni anandamu
Andariki panchaga
Sri rama namam nithyam smariyimpudu
Samsara sagaranni daati poyi
Moksha margam kanugonudu
Bhakthitho poojimpudu