Telugu Lyrics
ఆలింపుమా ఓ మనుజుడా
అందరికిని దైవ సమానులె
అన్నదమ్ములె ఓ మానవుడా
ఇదియే జీవిత సత్యము
ఇదియే జీవన యాగము
ఇదియే సృష్టి రహస్యము
ఇదియే దైవము
నీవు చేసిన కర్మలె
నిన్ను తరుమును ఓ మానవుడా
నీవు కోరిన ఫలములె
నిన్ను చేరును ఓ మానవుడా
ఇదియే జీవిత సత్యము
ఇదియే జీవన యాగము
ఇదియే సృష్టి రహస్యము
ఇదియే దైవము
ఆదిత్యుడైన దేవుని ఆజ్ఞలను
ఆలింపుమా ఓ మనుజుడా
అందరికిని దైవ సమానులె
అన్నదమ్ములె ఓ మానవుడా
అందరిలోన అందరు కలరు
నీలోనే లోకమున్నది
అన్యమౌనదే లేదని
తెలిసికొంటే సుఖమున్నది
ఆత్మనే తెలుసుకో
అంతరంగమె వెతుకో
అన్నింట నిండిన దైవమె
నీవే గమనించవో
ఆదిత్యుడైన దేవుని ఆజ్ఞలను
ఆలింపుమా ఓ మనుజుడా
అందరికిని దైవ సమానులె
అన్నదమ్ములె ఓ మానవుడా
English Lyrics / Transliteration
Aalimpu naa o manujudaa
Andarikini daiva samaanu le
Annadammule o maanvudaa
Idiye jeevitha satyamu
Idiye jeevana yaagamu
Idiye srushti rahasyamu
Idiye daivamu
Neevu chesina karmale
Ninnu tarumunu o maanvudaa
Neevu korina phalame
Ninnu cherunu o maanvudaa
Idiye jeevitha satyamu
Idiye jeevana yaagamu
Idiye srushti rahasyamu
Idiye daivamu
Aadityudaina devuni aagnalanu
Aalimpu naa o manujudaa
Andarikini daiva samaanu le
Annadammule o maanvudaa
Andarilona andaru kalaru
Neelone lokamunnadi
Anyamounade ledani
Telisikonte sukhamunnadi
Aatmane telusuko
Antaranga me vetuko
Anninta nindina daivame
Neeve gamaninchavo
Aadityudaina devuni aagnalanu
Aalimpu naa o manujudaa
Andarikini daiva samaanu le
Annadammule o maanvudaa