Telugu Lyrics
తన నీడతోనే నడిచి
తడబడుతూ తనలో తాను
ఒంటరిగా వెళ్ళిపోయెనే
ఒంటరిగా వెళ్ళిపోయెనే
చిరుగాలిలో చిక్కుకున్న
ఒక సీతాకోక చిలుకలా
గణిత సూత్రం తేలక
తప్పుతూనే వెళ్ళిపోయెనే
ఏమాత్రం బాధ్యతలేని
లోకంలో ఒక పయనం
కాలంతో కనుచీమలు
కొట్టుకుంటూ వెళ్ళిపోయెనే
అడుగడుగున నే నడిచి
తన నీడతోనే నడిచి
తడబడుతూ తనలో తాను
ఒంటరిగా వెళ్ళిపోయెనే
ఒంటరిగా వెళ్ళిపోయెనే
కళ్ళల్లోని కలలన్నీ
బరువెత్తుకుంటూ వెళ్ళిపోయెనే
కాళ్ళకున్న గజ్జెలు
మెలిమెలికలతో వెళ్ళిపోయెనే
ఆశలన్నీ ఆకాశంలో
మేఘాలై కరిగిపోయెనే
ఆశయాలన్నీ ఆదమరచి
నిద్రలోకి జారిపోయెనే
అడుగడుగున నే నడిచి
తన నీడతోనే నడిచి
తడబడుతూ తనలో తాను
ఒంటరిగా వెళ్ళిపోయెనే
ఒంటరిగా వెళ్ళిపోయెనే
English Lyrics / Transliteration
Tana needathone nadichi
Tadabadutu tanalo taanu
Ontariga vellipoyene
Ontariga vellipoyene
Chirugaalilo chikkukunna
Oka seetakoka chilukala
Ganita sutram telaka
Tapputune vellipoyene
Emaatram badhyathaleni
Lokamlo oka payanam
Kaalamtho kanuchimalu
Kottukuntu vellipoyene
Aduguduguna ne nadichi
Tana needathone nadichi
Tadabadutu tanalo taanu
Ontariga vellipoyene
Ontariga vellipoyene
Kallaloni kalalanni
Baruvettukuntu vellipoyene
Kaallakunna gajjlu
Melimelikalatho vellipoyene
Aashalanni aakashamlo
Meghalai karigipoyene
Aashayalanni aadamarachi
Nidraloki jaaripoyene
Aduguduguna ne nadichi
Tana needathone nadichi
Tadabadutu tanalo taanu
Ontariga vellipoyene
Ontariga vellipoyene