Telugu Lyrics
భక్తపరంపరల బ్రోచేటి నామం
అన్నింటా నిండిన అనంత నామం
ఆది అంతములేని అర్చన నామం
తారక నామమని తత్వజ్ఞులు మదిలో
ధ్యానం చేసెదరు ఘనత పొందెదరు
పవిత్ర నామమని పరిశుద్ధులు పలుకగ
పారాయణం చేసెదరు పుణ్యం పొందెదరు
నమ్మిన వారికి నమ్మశక్యముగాని
వరములు ఇచ్చెడి వినయ నామం
సందేహ నివారణ సర్వ శాంతి ప్రదాత
ఆదరణ చేసెడి ఆనంద నామం
శరణాగతి అని శరణు వేడిన యెడల
రక్షించు వేగమె రామ నామం
అరుదుగ అందరికి అందుబాటులో నున్న
కరుణామయ నామం కైవల్య నామం
English Lyrics / Transliteration
Bhakta paramparala brocheti namam
Anninta nindina anantha namam
Aadi antamuleni archana namam
Tharaka namamani thatvagnulu madilo
Dhyanam chesedaru ghana podedaru
Pavithra namamani parishuddulu palukaga
Parayanam chesedaru punyam pondedaru
Nammina variki nammashakyamugani
Varamulu icchedi vinaya namam
Sandeha nivarana sarva shanthi pradhatha
Adarana chechedi ananda namam
Sharanagathi ani sharanu vedina yedala
Rakshinchu vegama Rama namam
Aruduga andariki andubatulo nunna
Karunamaya namam kaivalya namam