Telugu Lyrics
పారాయణము సేయువారికి భావనలన్నియు తీరును
అరవిరిసిన పువ్వులందున అమర సుగంధమెట్లుండునో
సరగున పురాణములందున శ్రీహరి నామమెట్లుండునో
హరి హరి హరి యనుచు కీర్తించగ అరిష్టములన్నియు తొలగును
దివిజ నదులలో గంగయున్నతముగ శోభిల్లుచున్నట్లు
భువి భువిలో పురాణములందున శ్రీహరి నామమె ఉన్నతము
హరి హరి హరి యనుచు నుతింపగ పుణ్యఫలములె చేరును
పాల సంద్రమున అమృతమున్నతముగ వెలుగొందుచున్నట్లు
కలికల్మషముల పోగొట్టుటకు శ్రీహరి నామమె అమృతము
హరి హరి హరి యనుచు సేవించగ ముక్తి మార్గము కనబడును
English Lyrics / Transliteration
pārāyaṇamu sēyuvāriki bhāvanalanniyu tīrunu
arivirisina puvvuladuna amara sugandhametluṇḍunō
saruguna purāṇamuladuna śrīhari nāma-meṭluṇḍunō
hari hari hari yanuchu kīrtinchaga ariṣṭamulanniyu tolagunu
divija nadulalo gangayunnatamuga śōbhilluchunnaṭlu
bhuvi bhuvilō purāṇamuladuna śrīhari nāma-me unnatamu
hari hari hari yanuchu nutimpaga puṇya phalamule cērunu
pāla sandramuna amrutamunnatamuga velugonduchunnatlu
kalikalmaṣamula pogōṭṭuṭaku śrīhari nāma-me amṛtamu
hari hari hari yanuchu sēvinchaga mukti mārgamu kanabaḍunu