Telugu Lyrics
చిందిన నీళ్ళలో
గడప దాటి ఎడారి దాటి
బయలుదేరెనే బతుకు
కొండ దాటి కోన దాటి
దూరమేగెనే బతుకు
పడి లేచెను మడమలని
మలి దారులనే వెతుకు
కలిసొచ్చిన కలలన్నీ
కరిగిపోయెను మెరుపులని
తుంచిన బంధాలన్నీ
తరిగిపోయెను కలలని
నడి రేయిల తిరిగేటి
నా జీవితం…
వడబారిన ఒడిలోన
పడి ఉన్నానే…
కనుల నిండా కలలే
కరిగిపోయినా
కదిలే తీరం
కనబడకున్నా
భుజాన బారము
మోస్తూ ఉన్నా
బ్రతుకే బాటసారి
అంటూ సాగుతున్నా
ఏ గుడిలోన
ఏ దేవునికో
ఏ బలి నైవేద్యమో
నా కథ
అడవిలోని
అగ్ని కీలవో
అంధకారపు
వెలుగురేఖవో
నా బతుకు…
ఎండిన చెట్టుకి
చిగురు తొడగదు
అయినా ఎందుకో
ఆశ చావదు
ఎగసి పడ్డ
ఎండకెదురీదుతూ
పరుగు తీస్తూనే
ఉన్నా నేనెప్పుడూ
ఎడతెరిపి లేని
ఎడబాటుతో
నలిగి పోయినా
ఎపుడు ఏ ఆశ
తోడు వస్తుందని
ఎదురు చూస్తూ
నేనెప్పుడూ
వడబారిన ఒడిలోన
పడి ఉన్నానే…
English Lyrics / Transliteration
Chindina neellalo
Gadapa daati edari daati
Bayaluderene bathuku
Konda daati kona daati
Dooramegene bathuku
Padi lechenu madamalani
Mali daarulane vethuku
Kalisocchina kalalanni
Karigipoyenu merupulani
Thunchina bandhaalanni
Tharigipoyenu kalalani
Nadi reyila thirigeti
Naa jeevitham…
Vada baarina odilona
Padi unnane…
Kanula ninda kalale
Karigipoyina
Kadile theeram
Kanabadakunna
Bhujana baaramu
Mosthu unna
Brathuke baata saari
Antoo saaguthunna
Ye gudilona
Ye devunikoo
Ye bali naivedyamo
Naa katha
Adaviloni
Agni keelavo
Andhakaarapu
Velugu rekhavo
Naa bathuku…
Endina chettuki
Chiguru thodagadu
Ainaa enduko
Aasha chaavadu
Egasi padda
Endakedureeduthoo
Parugu theesthune
Unna nenepudoo
Edatheripi leni
Edabaatutho
Naligi poyina
Epudu ae aasha
Thodu vasthundani
Eduru choosthoo
Nenepudoo
Vada baarina odilona
Padi unnane…