Telugu Lyrics
అడుగడుగున నీతోనే… ఊపిరైనా నీతోనే
ఎదలో మెదిలే నీవే… కలలో కనిపించే నీవే
నా దారి నీవే… నా గమ్యం నీవే…
నీతో వస్తున్నా… నే నిను వీడనన్నా
లోకం మోసం చేసే… నేస్తాలెన్నో ఉండే
ఏ నాడూ నన్ను చేర… నీవే రాకున్నా
నీతో వుంటే నాకు… దిగులే లేదెపుడూ
నా చేయి వదలకు… నీతో వుంటా ఎపుడూ
నీ ఊసే లోకం… నీ రూపే దీపం
నా దారి నీవే… నా గమ్యం నీవే
నీతో వస్తున్నా… నే నిను వీడనన్నా
ఏదో నింగి కింద… నేనో చెట్టులాగ
ఎన్నో వానలున్నా… నిన్ను చేరలేకున్నా
జాలిగా నన్ను చూసి… నీవే అక్కున చేరి
నా బ్రతుకు తీరిన… తీరును మార్చినావయ్యా
నీ తోడులోనే… నా బ్రతుకు పుట్టింది
నా దారి నీవే… నా గమ్యం నీవే
నీతో వస్తున్నా… నే నిను వీడనన్నా
English Lyrics / Transliteration
Adugaduguna neethone… Oopireina neethone
Edalo medhile neeve… Kalalo kanipinche neeve
Naa daari neeve… Naa gamyam neeve
Neetho vasthunna… Ne ninu veedananna
Lokam mosam chese… Nesthaalenno unde
E naadu nannu chera… Neeve raakunna
Neetho vunte naaku… Digule ledhepodoo
Naa cheyi vadhalaku… Neetho vunta epudoo
Nee oose lokam… Nee roope deepam
Naa daari neeve… Naa gamyam neeve
Neetho vasthunna… Ne ninu veedananna
Edo ningi kinda… Nenoo chettulaaga
Enno vaanalunna… Ninnu cheralekunna
Jaaligaa nannu choosi… Neeve akkuna cheri
Naa brathuku theerina… Theerunu maarchinavyya
Nee thodulone… Naa brathuku puttindi
Naa daari neeve… Naa gamyam neeve
Neetho vasthunna… Ne ninu veedananna