Telugu Lyrics
కధలో కధలో సదా దుఃఖమే
నేనేనా నీవేనా సదా దుఃఖమే
ఎడబాటుగా నిదురలోన
ఏకాకిగా మెలుకువలోన
ఎదలో ఎదలో సదా దుఃఖమే
కధలో కధలో సదా దుఃఖమే
ఓడి గెలిచేటి ఈ జీవితం
కన్నీటి కెరటాల పయనం
నాకిదేమి తీరని శాపం
ఎందుకీ దారుణ గాయం
కనులలో కరిగిపోయే కలలు
మనసున నిలిచిపోయే గాయాలు
ఎదలో ఎదలో సదా దుఃఖమే
కధలో కధలో సదా దుఃఖమే
పయనానికే ఆశలు వాయనం
కలిసి సాగేటి తొలిపదము
చివరకు మిగిలేది ఒంటరితనం
మరింత వేదనో విరహం
మెరిసేటి వెలుగుల ఆనందాలు
మాసిపోయేటి చీకటి నిశలు
ఎదలో ఎదలో సదా దుఃఖమే
కధలో కధలో సదా దుఃఖమే
నేనేనా నీవేనా సదా దుఃఖమే
ఎడబాటుగా నిదురలోన
ఏకాకిగా మెలుకువలోన
ఎదలో ఎదలో సదా దుఃఖమే
కధలో కధలో సదా దుఃఖమే
English Lyrics / Transliteration
Kadhalo kadhalo sadhaa dukhame
Nenena neevena sadhaa dukhame
Edabaatugaa niduralona
Ekaakigaa melukovalona
Edalo edalo sadhaa dukhame
Kadhalo kadhalo sadhaa dukhame
Odi gelicheti ee jeevitham
Kanneti kerataala payanam
Naakidhemi theerani shaapam
Endukee daaruna gaayam
Kanulalo karigipoye kalalu
Manasuna nilichipoye gaayaalu
Edalo edalo sadhaa dukhame
Kadhalo kadhalo sadhaa dukhame
Payanaanike aashalu vaayanam
Kalisi saageti tholipadamu
Chivaruku migiledi ontarithanam
Marinthavedano viraham
Meriseti velugula aanandaalu
Maasipoyeti cheekati nishalu
Edalo edalo sadhaa dukhame
Kadhalo kadhalo sadhaa dukhame
Nenena neevena sadhaa dukhame
Edabaatugaa niduralona
Ekaakigaa melukovalona
Edalo edalo sadhaa dukhame
Kadhalo kadhalo sadhaa dukhame