Telugu Lyrics
భావంతో పిలిస్తే చాలు రావా
భక్తితో కొలిస్తే చాలు కావా
శరణం శరణం సాయి శరణం
అడగకనే ఇచ్చే దాతవు నువ్వే
కరుణకు రూపం నువ్వే
బాధలలో తోడు నీవే
అనాధలకు అండ నీవే
శరణం శరణం సాయి శరణం
అమ్మలగన్న అమ్మవయ్య
నాన్నలన్నా నాన్నవయ్య
అన్నలన్నా అన్నవయ్య
అక్కలన్నా అక్కవయ్య
బంధాలకు బంధం నీవే
బంధువులకన్నా మిన్న నీవే
శరణం శరణం సాయి శరణం
మమతల మల్లెలు పూసే తీరు
నీ ప్రేమలో తప్ప మరి ఎక్కడ
మనసున మమతలు నింపే తీరు
నీ కరుణలో తప్ప మరి ఎక్కడ
శరణం శరణం సాయి శరణం
కష్టాలలో ధైర్యం నీవే
నష్టాలలో ఓదార్పు నీవే
ఆశలన్ని అడియాశలు కానీయవు
ఆశ్రయం నీవంటె భయమేల
శరణం శరణం సాయి శరణం
English Lyrics / Transliteration
Bhavantho pilisthe chaalu raava
Bhakthitho kolisthe chaalu kaava
Saranam Saranam Sai Saranam
Adagakane icche daathavu nuvve
Karunaku roopam nuvve
Baadhalalo thodu neeve
Anaadhalaku anda neeve
Saranam Saranam Sai Saranam
Ammalaganamma avvaya
Naannalanna naannavayya
Annalanna annavayya
Akkalanna akkayya
Bandhalaku bandham neeve
Bandhuvulakanna minna neeve
Saranam Saranam Sai Saranam
Mamathala mallelu poose theeru
Nee premalo thappa mari ekkada
Manasuna mamathalu nimpe theeru
Nee karunalo thappa mari ekkada
Saranam Saranam Sai Saranam
Kashtaalalo dhairyam neeve
Nashtaalalo odhaarpu neeve
Aashalanni adiyaashalu kaaniyavu
Aashrayam nee vante bhayamela
Saranam Saranam Sai Saranam