Telugu Lyrics
సమయమెన్నడు నీవు
పారబోయకు ఓ చెలియ
పరులు కానగ పూయకు
రమణి నీ మోహనరూపము
రసికుల మనసుల కవ్వించ
మధురముగ నీ వయ్యారము
మరల మరల నుప్పొంగించ
మరులు కొన్న హృదయములకు
మాధుర్యము లందించు నీ
వరుస నా కన్నుల ముందు
వన్నెలెన్నో కనుపించ
నెమ్మదిగా నీ నడకలు
నిలువెత్తు బంగారు బొమ్మ
సమ్మదినిచ్చు చిరునవ్వులు
సందె పొద్దుల వెలుగులమ్మ
English Lyrics / Transliteration
Samayamennadu neevu
Paaraboyaku o cheliya
Parulu kaanaga pooyaku
Ramani nee mohana roopamu
Rasikula manasula kavvincha
Madhuramuga nee vayyaramu
Marala marala uppongincha
Marulu konna hrudayalakku
Madhurya mulandinchu nee
Varusa naa kannula mundu
Vannelenno kanupincha
Nemmadiga nee nadakalu
Niluvettu bangaru bomma
Sammadanichu chirunavvulu
Sande poddula velugamma