Telugu Lyrics
ఎల్లలు దాటి ఎంతో ఘనముగా
వినాయక రూపము మెరసి వెలిగెను
వినాయక రూపము మెరసి వెలిగెను
నిను కొలిచే భక్తుల మొక్కులన్ని
నిన్నే చేరేనయ్యా
సకల సంపదల నీవే ఇచ్చే
సిరుల రాశివయ్యా
అంకుశము ధరించి అరిషడ్వర్గముల
అణచే దైవానివే
అభయము నిచ్చే కరముల తోడ
అన్నిటినీ నిలుపు దైవానివే
మూషిక వాహనమెక్కి వచ్చి వెలిగెను
ఎల్లలు దాటి ఎంతో ఘనముగా
వినాయక రూపము మెరసి వెలిగెను
వినాయక రూపము మెరసి వెలిగెను
గణపతి గణాధిపతి గణ నాయకా
జగమెల్ల నిన్ను కొలిచెగా
విఘ్నేశ్వర విఘ్న నివారకా
విజయాలు నిన్నే చేరగా
భుజంగ భూషిత దేవుడా
పూజలందుకొనే దైవమా
భక్త పాలన చేసే రాజా
వరములన్నియు నిచ్చే రాజా
ఏలేకా వాహనమెక్కి వచ్చి వెలిగెను
ఎల్లలు దాటి ఎంతో ఘనముగా
వినాయక రూపము మెరసి వెలిగెను
వినాయక రూపము మెరసి వెలిగెను
English Lyrics / Transliteration
Ellalu daati entho ganamugaa
Vinayaka roopamu merasi veligenu
Vinayaka roopamu merasi veligenu
Ninu koliche bhaktula mokkulanni
Ninne cherenayya
Sakala sampadala neeve icche
Sirula raasivayya
Ankushamu dharinchi arishadvargamula
anche daivanive
Abhayamu nicche karamula thoda
Annitini nilupu daivanive
Mooshika vaahanamekki vachi veligenu
Ellalu daati entho ganamugaa
Vinayaka roopamu merasi veligenu
Vinayaka roopamu merasi veligenu
Ganapathi Ganadhipathi Gana Nayaka
Jagamella ninnu kolichegaa
Vigneshwara Vigna Nivaraka
Vijayaalu ninne cheragaa
Bhujanga bhooshitha devudaa
Poojalandukune daivamaa
Bhakta paalana chese raajaa
Varamulanniyu nicche raajaa
Yeleka vaahanamekki vachi veligenu
Ellalu daati entho ganamugaa
Vinayaka roopamu merasi veligenu
Vinayaka roopamu merasi veligenu