Telugu Lyrics
ఏ భావమో కలిగేను ఈ క్షణంలో
పలికే మాటలు కమ్మని అమృత ధారలు
చేసే పనులు అపురూప కావ్యాలు
మనసు దోచే నీ రూపం
మధుర మధురమే ఓ ప్రియతమా
నీ చూపులో వెన్నెల వెలుగులు
నీ నవ్వులో పూల పరిమళాలు
నాలోన వెలిగేను దీపాల వెలుగులు
నీలోన కరిగెను కలల లోకాలు
ఒకటాయెను మన జీవన పయనాలు
జతకూడెను ఈ జన్మంతా
మనసు దోచే నీ రూపం
మధుర మధురమే ఓ ప్రియతమా
కమ్మని నీ పలుకులు వింటూ
మత్తుగా నే మైమరచి పోతూ
ఈ లోకం నే మరిచి పోతూ
నీ దారిలో నే నడచి పోతూ
ఒడిలోన నీవు ఒదిగిపోనీ
వలపులన్నీ పంచుకొని
మనసు దోచే నీ రూపం
మధుర మధురమే ఓ ప్రియతమా
English Lyrics / Transliteration
Eh bhavamo kaligenu ee kshanamlo
Palike maatalu kammani amrutha dharalu
Chese panulu apuroopa kavyalu
Manasu doche nee roopam
Madhura madhurame o priyathama
Nee choopulo vennela velugulu
Nee navvulo poola parimalalu
Naalona veligenu deepala velugulu
Neelona karigenu kalala lokalu
Okataayenu mana jeevana payanalu
Jatha koodenu ee janmantha
Manasu doche nee roopam
Madhura madhurame o priyathama
Kammani nee palukulu vintoo
Mattuga ne maimarachi pothoo
Ee lokam ne marichi pothoo
Nee daarilo ne nadachi pothoo
Odilona neevu odigiponee
Valapulanni panchukoni
Manasu doche nee roopam
Madhura madhurame o priyathama